News February 22, 2026
MBNR: గుప్తనిధుల పేరిట భారీ మోసం..!

గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందుగా పాతిపెట్టిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తవ్వి, అది రూ.కోట్లు విలువైందని నమ్మించి బాధితుడిని మోసం చేసినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని.. వారికోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News February 22, 2026
TGకి 60, APకి 21 సూపర్ స్పెషాలిటీ సీట్లు మంజూరు

నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సూపర్ స్పెషాలిటీ సీట్లను పెంచింది. TGకి 60 (ప్రభుత్వ కాలేజీలకు 36, ప్రైవేట్‌కు 24)సీట్లు దక్కాయి. APకి 21 సీట్లు (Govt కాలేజీలకు 14, ప్రైవేట్‌కు 7) సీట్లు మంజూరయ్యాయి. ఈ సీట్ల పెంపుతో కిడ్నీ, క్యాన్సర్, న్యూరో వంటి వ్యాధులకు చికిత్స అందించే వైద్యులు ఇక్కడే తయారు కానున్నారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం తగ్గనుంది.
News February 22, 2026
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో MLC అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హోం శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో పనిచేసిన DSPలు భీమారావు, మురళీకృష్ణారెడ్డి, CI మురళీకృష్ణ, SI సతీశ్‌ను సస్పెండ్ చేసింది. సిట్ నివేదిక, పోలీసుల పాత్రపై అనుమానాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు వాఖ్యల మేరకు చర్యలు తీసుకుంది. కాగా ఈ కేసులో అనంతబాబు దంపతులు పరారీలో ఉన్నారు.
News February 22, 2026
NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.


