News January 8, 2025
MBNR: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
Similar News
News January 8, 2025
MBNR జిల్లా ఆసుపత్రిలో డెవలప్‌మెంట్ కమిటీ కీలక భేటీ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ డీకే అరుణ బుధవారం డెవలప్‌మెంట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రుల అప్ గ్రేడ్, ఇతర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అధికారులు పాల్గొన్నారు.
News January 8, 2025
AMAZING: తాజ్‌మహల్‌లో పాలమూరు రాళ్లు!
తాజ్‌మహల్ నిర్మాణంలో మహబూబ్‌నగర్ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్‌జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ& రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్‌కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్‌మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.
News January 8, 2025
MBNR: తగ్గిన ధరలు.. టమాటా రైతుల ఆందోళన
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతుబజార్‌లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.