News February 7, 2025
MBNR: గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆరాధ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. ఆరాధ్య తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. ఆరాధ్య మృతికి సంబంధించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎస్పీ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
HYDలో హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్‌లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.
News March 2, 2026
నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.
News March 2, 2026
GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.


