News December 4, 2025
MBNR: గుర్తులొచ్చాయ్.. ప్రచారం షురూ

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న నిర్వహించనున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఎలక్షన్ అధికారులు ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో మునిగిపోయారు.
Similar News
News December 5, 2025
ANU: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఆగస్టు నెలలో జరిగిన ఎం ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ
ఫలితాలలో 83.78%, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలలో 84.77% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కొరకు ఈనెల 15వ తేదీ లోపు రూ.2,190 నగదు చెల్లించాలన్నారు.
News December 5, 2025
ఈ రోజుల్లో సాధారణ భక్తులకు దర్శనాలుండవు: TTD

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 30,31, జనవరి 1వ తేదీల్లో సర్వ దర్శనం, స్పెషల్ ఎంట్రీ, శ్రీవాణి వంటి దర్శనాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ మూడు రోజులు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. సాధారణ భక్తులు ఈ మూడు రోజుల్లో దర్శనాలకు వచ్చి ఇబ్బంది పడొద్దని టీటీడీ సూచించింది. 2026, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సాధారణ భక్తులూ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని తెలిపింది. share it
News December 5, 2025
చింతపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు

స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. గురువారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో, చింతపల్లి మండలానికి చెందిన 27 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.3కోట్ల 15లక్షల రుణాలు చెక్కును కలెక్టర్ పంపిణీ చేశారు. రుణాలు సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించాలన్నారు.


