News February 12, 2026
MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 15, 2026
మన్యంకొండలో శేష వాహన సేవ

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.
News February 14, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

✒గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన AIFB విజేతలు
✒పాలమూరు: జాగృతి, AIFB ఉమ్మడి విజయం: జోజిరెడ్డి
✒జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ
✒పాలమూరుకు మహర్దశ.. రూ.3,175 కోట్లతో హైవే
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పాలమూరులో ‘గ్లాసు’ ఖాళీ.. ప్రభావం చూపని జనసేన
✒గద్వాల్:జంపింగ్ ఎమ్మెల్యేలకు BRS ‘విప్’ సెగ
✒శివరాత్రి.. రేపు ఆలయాల వద్ద బందోబస్తు:SP
News February 14, 2026
MBNR: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లల మర్రి వద్దనున్న శివాలయం వద్ద పటిష్ఠ భద్రత ఆ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.


