News November 7, 2024

MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

Similar News

News November 7, 2024

మహబూబ్‌నగర్: LOVE FAIL యువకుడి SUICIDE

image

లవ్‌లో ఫెయిల్ అయిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన HYD అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన సాయి కుమార్ (19) ఎలక్ట్రిషన్‌గా పని చేస్తూ చదువుకుంటున్నాడు. కాగా, కొద్ది రోజులుగా లవ్ ఫెయిల్ అయ్యి డిప్రెషన్‌లో ఉన్నాడని, అదే బాధతో ఉరేసుకున్నట్లు తెలిపారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2024

గద్వాల: కూతురికి వేధింపులు.. తండ్రి సూసైడ్

image

కూతురిని ఓ యువకుడు వేధిస్తున్నాడని ఓ తండ్రి ట్రైన్ కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాలలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. మండలానికి చెందిన పరుశురాములు కూతురిని వినోద్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడిని పలు మార్లు మందలించినా మారలేదు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన పరుశురాములు వెంకంపేట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

News November 7, 2024

MBNR: సీఎం సహాయ నిధికి విరాళం అందజేత

image

రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం సీఎం సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ కలిసి టీజీకాబ్ పాలకవర్గం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో TGCAB ఛైర్మన్ రావు తదితరులు పాల్గొన్నారు.