News February 12, 2025
MBNR: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
గద్వాలలో కాంగ్రెస్‌కు భారీ షాక్..?

జిల్లాలో కాంగ్రెస్‌కి భారీ షాక్ తగలనుందని స్థానికులు అనుకుంటున్నారు. కేటీదొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు BRSలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. BRS గద్వాల ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో వీరంతా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
News September 19, 2025
మాజీ సీఎం జగన్ రూట్ మార్పు

తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన వైఎస్ జగన్ ప్రయాణంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో జగన్ వాహనశ్రేణి ప్రకాశం బ్యారేజీ మీదుగా గన్నవరం బయలుదేరింది.
News September 19, 2025
HYD: నేడు HCUలో విద్యార్థి సంఘం ఎన్నికలు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుతుంది. నేడు ఉ.9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపస్‌లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అనంతరం సాయంత్రం బ్యాలెట్ బాక్స్‌లను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు.