News March 10, 2025

MBNR: చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతి

image

చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Similar News

News February 5, 2026

MBNR:PU.. ఫలితాలు విడుదల UPDATE!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనములో యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ డిగ్రీ 1వ సెమిస్టర్(30.08%), 3వ సెమిస్టర్ (39.72%), 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.

News February 5, 2026

పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి

image

పదో తరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పదో తరగతి ఎస్.సి.సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గురువారం అంబేడ్కర్ కళా భవన్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల పై ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

News February 5, 2026

MBNR: PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి

image

నూతన బడ్జెట్ పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ప్రతిభ కనబరిచిన యువతి, యువకులు జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానమంత్రిని సంభాషించే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, ఆసక్తి గల యువత https://mybharat.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. SHARE IT