News December 21, 2024
MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 30, 2024
కల్వకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి యువకులు మృతి
కల్వకుర్తిలోని కొత్త కాటన్ మిల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌పై కల్వకుర్తి వైపు వస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణానికి చెందిన శ్రీనాథ్ (17), భాను (16)గా గుర్తించారు. మృతులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News December 30, 2024
వనపర్తి: ‘లిఫ్ట్ ఇరిగేషన్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు విడుదల’
కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రూ.1 కోటి 63 లక్షల మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT నంబర్ 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News December 30, 2024
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు గద్వాల జిల్లా యువకుడు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన వేణు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. తనకు సహకారం అందించిన కోచ్, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడిని గ్రామస్థులు అభినందించారు.