News March 11, 2025
MBNR: జాగ్రత్త సుమా.. పెరుగుతున్న భానుడి ప్రతాపం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు. 37 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ తలిగే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత బయటికి రాకపోవడమే మంచిదంటున్నారు. గత వారం రోజుల నుంచి రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Similar News
News March 12, 2025
MBNR: తెలంగాణ బడ్జెట్.. పాలమూరుకి ఏమి కావాలంటే.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయాయి. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్ల విస్తరణ, సాగునీటి సరఫరా, దీర్ఘకాల సమస్యలు, గ్రామాల్లో హెల్త్ సెంటర్లు, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
News March 12, 2025
MBNR: LRS రాయితీ.. ఫోన్ చేయండి.!

మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25% రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర ఓ ప్రకటనలో తెలిపారు. సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542-241165, జిల్లా నగర పాలక సంస్థలో హెల్ప్ లైన్ నంబర్ 7093911352 (ఉ.10 గంటల-సా.6 గంటల వరకు)కు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 12, 2025
GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.