News July 28, 2024
MBNR: జిల్లాలో ఇక స్థానిక ఎన్నికల జోష్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. CM రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావహుల్లో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి 6నెలలు అవుతుండగా, MPTC, ZPTCల పదవీ కాలం ఈనెల 5న ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని, ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తొలుత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 12, 2026
MBNR: రేపే కౌంటింగ్.. ఇవి నిషేధం: SP

పాలమూరు యూనివర్సిటీ (లెక్కింపు కేంద్రం) పరిసర ప్రాంతాల్లో BNSS 163 ప్రకారం నిషేధాజ్ఞలు (సెక్షన్ 144 అమలు) శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉ.6 గంటల వరకు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా భద్రతకు ముప్పు కలిగించే ఏవైనా వస్తువులు లెక్కింపు కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
News February 12, 2026
MBNR: నియమాలు ఉల్లంఘిస్తే రిమాండ్‌కే: SP

పాలమూరు యూనివర్సిటీ వద్ద ఓట్ల లెక్కింపుకు నియమించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి బందోబస్తుపై పలు సూచనలు చేశారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తామని హెచ్చరించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. SHARE IT.
News February 12, 2026
MBNR: ‘తెలంగాణ తరహా కర్ణాటకలో కులవృత్తులను పునరుద్ధరించాలి’

తెలంగాణ రాష్ట్రంలో ఉండే కులవృత్తుల మాదిరిగా కర్ణాటక రాష్ట్రంలో కూడా కులవృత్తులను పునరుద్ధరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రణవ నంద స్వామి పాదయాత్ర ప్రారంభించి 700 కిలోమీటర్లకు చేరగా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటక విధాన సభలో నారాయణ గురు స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు.


