News April 9, 2024
MBNR: జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

ఉమ్మడి MBNR జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి రెండు ఎంపీ స్థానాలపై గురి పెట్టారు. నిన్న కొడంగల్‌లో పర్యటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.
Similar News
News April 21, 2025
MBNR: ‘మోడల్ నీట్ పరీక్షను విజయవంతం చేయండి’

దేశ వ్యాప్తంగా మే 4న నీట్ పరీక్ష ఉంది. ఈ క్రమంలో ముందుస్తుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ నీట్ పరీక్ష ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 వరకు, 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12 వరకు MBNRలో నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ అన్నారు. ఈ పేపర్ ఐఐటీ చుక్కా రామయ్య సంస్థ నుంచి వస్తుందని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News April 21, 2025
నారాయణపేట: OYO రూమ్‌లో యువకుడి సూసైడ్

NRPT జిల్లా గుండుమాల్ వాసి కుమ్మరి రాజేశ్(22) HYDలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమ్మరి రాజేశ్ HYD అంబర్‌పేట్ పరిధి రామ్‌నగర్‌లో ఉంటూ ప్రెవేట్ జాబ్ చేస్తూ పీజీ ఎంట్రెన్స్‌కు సిద్ధమవుతున్నాడని చెప్పారు. ప్రేమ విఫలం కావడంతో రామ్‌నగర్‌లోని ఓయో హోటల్ రూమ్‌లో ఆదివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్ఐ బాలరాజ్ తెలిపారు.
News April 21, 2025
MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డాకుల 20.5 మిల్లీమీటర్లు, మిడ్జిల్ మండలం దోనూరు 14.3 మిల్లీమీటర్లు, మూసాపేట మండలం జానంపేట 6.0 మిల్లీమీటర్లు, కౌకుంట్ల 3.8 మిల్లీమీటరు బాలానగర్ మండలం ఉడిత్యాల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో వరి కోతలకు పొలం తడి ఆరడం లేదన్నారు.