News April 25, 2025
‘MBNR జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి’

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.
Similar News
News November 9, 2025
BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

మిడ్జిల్ మండలం బోయిన్పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 9, 2025
MBNR: ఈనెల 12న అథ్లెటిక్స్ ఎంపికలు: శారదాబాయి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో బాల, బాలికలకు అథ్లెటిక్స్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. MBNRలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9:00 గంటలలోపు పీడీ ఆనంద్ కుమార్‌కి రిపోర్ట్ చేయాలన్నారు.
News November 9, 2025
చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.


