News July 21, 2024

MBNR: జూరాలలో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరగడంతో జూరాల వద్ద పర్యాటకులను అధికారులు హెచ్చరిస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 83వేల క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

Similar News

News September 4, 2025

MBNR: వినాయక నిమజ్జనం.. ఏర్పాటు సిద్ధం- SP

image

MBNRలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని విధాలైన భద్రతా, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులు సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామని పేర్కొన్నారు.

News September 4, 2025

MBNR: రేపు వినాయక నిమజ్జనం.. పటిష్ఠ ఏర్పాట్లు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న గణనాథులను రేపు నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పట్టణంలో పలు డైవర్షన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ డైవర్షన్స్‌కి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో కార్యక్రమంలో నిర్వహించాలన్నారు.

News September 3, 2025

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో వర్షాలు

image

గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు ఉదయం 7 గంటల సమయానికి అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 43.5 ఎంఎం వర్షపాతం, గండీడ్ మండలంలో 35.0 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అడ్డాకుల మండలంలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల మండలంలో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా సగటున 10.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.