News February 12, 2025
MBNR: టెన్త్ అర్హతతో 44 ఉద్యోగాలు

మహబూబ్ నగర్ డివిజన్‌లో 20, వనపర్తి డివిజన్‌లో 24 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News February 27, 2026
ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2026
సిద్దిపేట: మార్చి 1న ప్రవేశ పరీక్ష

టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్‌ని tsstudycircle.co.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News February 27, 2026
అల్లూరిలో తెలుగు భాష పండితుల పదోన్నతులు

అల్లూరి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 తెలుగు భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కావడం శుభపరిణామమని జిల్లా తెలుగు భాష పండితుల యూనియన్ నాయకులు శిరగం కోటేశ్వరరావు, కూడా నాగేశ్వరరావు తెలిపారు.


