News August 16, 2025

MBNR: ట్రావెల్స్ బస్సు లారీ ఢీ UPDATE

image

జడ్చర్ల మండలం మాచారం వద్ద నిన్న తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు లారీని <<17409311>>ఢీకొన్న<<>> ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కూకట్‌పల్లికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి, రాధిక మృతి చెందగా, చికిత్స పొందుతూ క్లీనర్ మరణించాడు. అత్తాకోడళ్లు ఇద్దరూ మొదట పైబెర్తులో ఉండగా మార్గమధ్యంలో కిందికి వచ్చారు. పైనే ఉండి ఉంటే బతికేవారని బంధువులు విలపించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులు కోలుకుంటున్నారు.

Similar News

News August 16, 2025

సర్పంచ్ సాబ్‌లు వచ్చేదెప్పుడో.. బిల్లులు పడేదెప్పుడో?

image

TG: బిల్లులు పేరుకుపోవడంతో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. కొత్త సర్పంచులు వచ్చాకే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నిధులు విడుదల అవుతాయి. దీంతో కాంట్రాక్టర్లు గ్రామాలకు శానిటరీ, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే రూ.కోట్లలో బిల్లులు రావాల్సి ఉందంటున్నారు. అటు BC రిజర్వేషన్లతో ‘స్థానిక ఎన్నికలు’ ఆలస్యం అవుతున్నాయి.

News August 16, 2025

హన్మకొండలో కనువిందు చేసిన బ్రహ్మాకమలాలు

image

హిమాలయాల్లో కనిపించే అరుదైన బ్రహ్మకమలాలు హన్మకొండలో కనువిందు చేశాయి. రెడ్డికాలనీకి చెందిన ప్రసాదరావు-సాగరిక దంపతుల ఇంట్లో ఈ అరుదైన పుష్పాలు వికసించాయి. నాలుగేళ్ల క్రితం మొక్కను తీసుకొచ్చి నాటారు. శుక్రవారం రాత్రి తొలిసారిగా వికసించాయి. దీంతో చుట్టుపక్కల వారు తరలివచ్చి పుష్పాలను వీక్షిస్తున్నారు. ఇది మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన పుష్పం.

News August 16, 2025

విశాఖ ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ విజ్ఞప్తి

image

విశాఖ నగరంలో భారీ వర్షాలు ఉన్నందున ఇప్పటికే జీవీఎంసీ అప్రమత్తంతో ప్రత్యేక చర్యలను చేపట్టిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ప్రజలు ఇళ్లలో విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండరాదని కమిషనర్ సూచించారు. ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే జీవీఎంసీ కంట్రోల్ రూమ్‌ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009కు సమాచారం అందించాలని కోరారు.