News July 5, 2025
MBNR: ట్రిపుల్ ఐటీ మొదటి దశ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు

మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో ఎంపికైన 66 మంది విద్యార్థులకు ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ గోవర్ధన్ శుక్రవారం వెల్లడించారు. ఈనెల 7న జాబితాలోని S.No-1-564 వరకు, 8న 565-1,128 వరకు, 9న 1,129-1,690 వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. దరఖాస్తులో పొందుపరిచిన సర్టిఫికేట్లతో ఉదయం 9 గంటల వరకు IIITలో హాజరుకావాలని కోరారు. SHARE IT.
Similar News
News July 5, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం

గడిచిన 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 108.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చూస్తే మహదేవ్‌పూర్ 9.2 మి.మీ, పలిమెల 32.8, మహముత్తారం 42.4, కాటారం 3.6, మల్హర్ 10.4, చిట్యాల 3.2, టేకుమట్ల 1.0, రేగొండ 1.4, భూపాలపల్లి 4.2 మి.మీ.లుగా నమోదైంది.
News July 5, 2025
పల్నాడు: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.35కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.38, వంకాయ రూ.36, దొండ రూ.38, బెండ రూ.27 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News July 5, 2025
ప్రభుత్వ సలహాదారునిగా పి.గన్నవరం వాసి బాధ్యతలు

పి. గన్నవరంలోని ఊడిమూడికి చెందిన జనసేన పార్టీ నాయకుడు పెన్నమరెడ్డి నాగబాబు ఇటీవల అటవీ శాఖ ఐటీ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలోని సచివాలయం వద్ద శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. తనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేస్తానని నాగబాబు తెలిపారు.