News October 24, 2025
MBNR: డిగ్రీ ఫీజుకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్) పరీక్షల ఫీజు కట్టేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ నెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించ వచ్చని అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించడానికి శనివారం వరకు అవకాశం ఉందన్నారు. లేట్ ఫీజుతో ఈ నెల 29 వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించారు.
Similar News
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News October 25, 2025
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి..!

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార వర్గాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
News October 25, 2025
కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.


