News October 12, 2025
MBNR: డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ నజర్..!

ఉమ్మడి MBNR జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకాలపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. అధిష్ఠానం కసరత్తులో జిల్లా ఇన్‌ఛార్జ్‌ల పర్యటన అనంతరం పార్టీ శ్రేణుల ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 16 వరకు అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌లు పర్యటించి నిర్ణయం తీసుకుంటున్నట్లు నారాయణపేట జిల్లా ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి తెలిపారు.
Similar News
News October 12, 2025
పెద్దపంజాణిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

పెద్దపంజాణి మండలం వీర పల్లె కొండపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతుండగా అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీతో పాటు కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. మరో నలుగురు పరారీ కాగా వారికోసం గాలిస్తున్నారు.
News October 12, 2025
ADB: కూలెక్కిన రాజకీయం..!

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజుల వరకు భారీగా ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు అసలు ఇప్పట్లో జరుగుతాయని ప్రశ్న అందరిలో మొదలైంది. ఉట్నూరు, నార్నూర్ తదితర మండలాల్లో నాయకులు కనీసం చాయ్ కూడా తాపడం లేదని చర్చ నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల అరే ఇప్పుడు కాదు మల్ల పెద్దగానే దావత్ చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
News October 12, 2025
ADB: అన్నదాతలకు గమనిక.. పంటల మద్దతు ధరలివే..!

కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల ధరలు నిర్ణయించింది. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే వానాకాలం పంటలు చేతికి వస్తున్నాయి. అధికంగా సాగు చేసే పత్తిలో మధ్యరకం పింజ కలిగిన దానికి క్వింటాకు రూ.7,710, పొడవురకానికి రూ.8,110, వరి సాధారణ రకానికి రూ.2,369, ఏ గ్రేడ్‌కు రూ.2,389, జొన్నలు హైబ్రిడ్‌కు రూ.3,699, మాల్ దండికి రూ.3,749, సోయా రూ.5,328, కంది రూ.8,000గా నిర్ణయించారు.
SHARE IT