News February 1, 2025
MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 1, 2026
విజయవాడలో వివాహిత సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలోని మాచవరంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మృతురాలు బజినున్నీసా కిషోర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. శనివారం రాత్రి వీరిరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI దుర్గ భవాని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News March 1, 2026
ADB: మోదుగు పూలతో.. చిన్నారుల హోలీ కేలీ

రంగుల పండుగ హోలీకి ఉమ్మడి ADBలోని చిన్నారులు సరికొత్తగా సిద్ధమవుతున్నారు. మార్కెట్లో లభించే రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రకృతి ప్రసాదించిన మోదుగు పూలతో రంగులను స్వయంగా తయారు చేస్తున్నారు. అడవిలో లభించే ఈ పూలను సేకరించి, వాటిని నీటిలో మరిగించి పర్యావరణహిత కాషాయం, పసుపు వర్ణపు రంగులను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న ఈ చిన్నారుల ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.
News March 1, 2026
ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్‌షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.


