News February 1, 2025
MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 12, 2025
తాళ్లకోడు లేఔట్‌లో సామూహిక నూతన గృహప్రవేశాలు

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల లేఔట్‌లో NTR కాలనీలో సమూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పలువురి లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ అనురాధ ఉన్నారు.
News November 12, 2025
చిన్నమండెం: CM సభలో మాట్లాడిన మహిళ

అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో బుధవారం CM చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా కొందరు ఇళ్ల లబ్ధిదారులైన మహిళలు మాట్లాడారు. అంజనమ్మ మాట్లాడుతూ.. తన భర్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, అధిక అద్దెలతో ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇంట్లో సంతోషంగా ఉంటామని చెప్పుకొచ్చారు. తమ సొంతింటి కలను CM నిజం చేశారన్నారు.
News November 12, 2025
చిన్నబొంకూర్‌లో ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు వరి కోతల అనంతరం ధాన్యాన్ని తగినంతగా ఆరబెట్టి సెంటర్లకు తీసుకురావాలని తెలిపారు. ఈ పరిశీలనలో డీసీఎస్ఓ, డిటిఓ పాల్గొన్నారు.


