News January 30, 2025

MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

image

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.

Similar News

News March 1, 2026

GST వసూళ్లలో తెలంగాణ దూకుడు

image

TG: GST వసూళ్లలో రాష్ట్రం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2026 FEBలో ₹4,125 CR GST వసూలు అయింది. 2025 FEB కన్నా ఇది 14% ఎక్కువ. ఈ ఏడాది చివరి త్రైమాసికం కనుక పన్ను వసూళ్లు ఇంకా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు GST చెల్లింపులకు సంబంధించిన పన్ను బకాయిలను ఫిబ్రవరి, మార్చిలో క్లియర్ చేస్తుంటారు. చివరి నెల MARలో ఈ వసూళ్లు మరింత ఎక్కువ ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

News March 1, 2026

SKLM: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి

image

కోటబొమ్మాళి మండలం వాండ్రాడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం కళ్యాణ శ్రీనివాసరావు (48) వాండ్రాడ నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు కాగా నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2026

T20WC: భారత్ టార్గెట్ ఎంతంటే?

image

INDvsWI: సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో WI నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 రన్స్ చేసింది. ఓపెనర్లు హోప్ (32), ఛేజ్ (40) శుభారంభం అందించారు. క్రీజులో ఉన్నంతసేపు హెట్‌మెయర్(12 బంతుల్లో 27) మెరిపించారు. చివర్లో పావెల్(34*), హోల్డర్(37*) భారీ షాట్లు ఆడారు. బుమ్రా 2.. పాండ్య, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.