News January 30, 2025
MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
Similar News
News February 6, 2026
NZB: KCR దత్త పుత్రుడు కిషన్ రెడ్డి: CM

బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసిఆర్‌కు దత్త పుత్రుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన బర్దీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి, కేసీఆర్‌ను అవినీతి విషయంలో ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దత్త పుత్రుడు కిషన్ రెడ్డి అంటూ విమర్శించారు.
News February 6, 2026
సిద్దిపేట: ఓపెన్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు రీషెడ్యూల్

మున్సిపల్ ఎన్నికల కారణంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ(CBCS) 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చినట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రద్ధానందం తెలిపారు. సెమ్-5 పరీక్షలు ఈనెల 17 నుంచి 22 వరకు, సెమ్-3 పరీక్షలు 24 నుంచి మార్చి 2 వరకు, సెమ్-1 పరీక్షలు మార్చి 4 నుంచి 10 వరకు రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్లను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
News February 6, 2026
ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడా?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడనే కుట్రకు తెరతీసి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటూ కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని.. కావాలనే హత్య చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.


