News October 19, 2024

MBNR: తెల్లారితే పెళ్లిచూపులు.. యువతి అదృశ్యం

image

యువతి అదృశ్యమైన ఘటనలో కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ నాయక్ తెలిపారు. బల్మూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం పెళ్లిచూపులు జరగాల్సి ఉండగా గురువారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా అదృశ్యమైంది. తెల్లవారుజామున గమనించిన తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.

Similar News

News October 19, 2024

పాలమూరు జిల్లా ‘CRICKET’ జట్ల ఎంపిక

image

మహబూబ్ నగర్ పట్టణంలోని అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 90 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 6 జట్లను ఎంపిక చేశామని, ఎంపికైన జట్లతో ఈ నెల 21 నుంచి 28 వరకు పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు.

News October 19, 2024

మాడ్గుల్: పిడుగుపాటు గురై 22 గొర్రెలు మృతి

image

మాడ్గుల్ మండలంలోని అంతంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములతో కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై 22 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గొర్రెల యజమానులు మేత కోసం తమ మూగజీవాలను పొలాలకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన యాటెల్లి రాములుకు చెందిన 12 గొర్రెలు, ముచర్ల చిన్న బక్కయ్యకు చెందిన 10 గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు చెప్పారు.

News October 19, 2024

పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ ప్రొఫైల్

image

పీయూ VCగా రానున్న GN శ్రీనివాస్‌‌ది కరీంనగర్ జిల్లా గంభీరావ్‌పేట(M) కొత్తపల్లి. ఆయన 1-10వ తరగతి వరకు గంభీరావ్‌పేట, ఇంటర్ కామారెడ్డి, బీటెక్-JNTU, ఏఈ-OU, HD పట్టా JNTU నుంచి అందుకున్నారు. JNTUలో UGC మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్‌కు డైరెక్టర్‌గా, 77-ఎంటెక్,28-బీటెక్ ప్రాజెక్టులకు గైడ్‌గా వ్యవహరించారు. ‘ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఆన్ మెస్యూరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ ప్రత్యేక లెక్స్ బుక్ రచించారు.