News January 22, 2025

MBNR: తొలిరోజు రేషన్ కార్డులకే అధికం

image

ఉమ్మడి జిల్లాలో తొలిరోజు గ్రామ, వార్డు సభలకు దరఖాస్తుదారులు పోటెత్తారు. 4 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక జాబితాతో పేర్లు లేకపోవడంతో ప్రజలు నిలదీయడం, అధికారులు సముదాయించడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. తొలిరోజు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులకు MBNRలో 6096, NGKLలో 2826, వనపర్తిలో 4749 అప్లికేషన్లు రాగా, గద్వాలలో మొత్తం 7539, NRPTలో 3073 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News September 14, 2025

MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

image

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

News September 13, 2025

MBNR: యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశం

image

జిల్లాలోని ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు వెంటనే సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

News September 12, 2025

MBNR: ‘ఉర్దూ ఘర్’ నిర్మాణాన్ని ఆపాలని జేఏసీ నాయకుల డిమాండ్

image

MBNRలోని స్థానిక అంబేడ్కర్ కళా భవనం పక్కన ప్రభుత్వం నిర్మిస్తోన్న ఉర్దూ ఘర్‌తో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ జేఏసీ MBNR శాఖ నాయకులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంటుందని, ఆ భవన నిర్మాణాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం HYDలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను వారు కలిసి వినతిపత్రం ఇచ్చారు.