News January 5, 2026

MBNR: త్వరలో ఎన్నికలు.. కొత్త ఓట్లకు NO ఛాన్స్

image

పుర పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త ఓటర్ల నమోదుపై నిషేధం విధించారు. ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో కొత్త ఓటర్ల నమోదు సేవలను నిలిపి వేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు.. పట్టణ స్థానిక సంస్థల్లోకి చొరబడకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తోంది. కాగా ఉమ్మడి MBNRలో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 11, 2026

అసెంబ్లీ సమావేశాలకు జగన్.. ‘వార్’ తప్పదా?

image

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై గవర్నర్ ప్రసంగించనున్న నేపథ్యంలో YCP చీఫ్ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు, MLCలు హాజరవుతారని విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత జగన్ సభ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారీ పూర్తిగా హాజరవడం అనుమానమే. ఒకవేళ హాజరైతే కల్తీ నెయ్యి అంశంపై కూటమి, YCP నేతల మధ్య వార్ ఖాయంగా కనిపిస్తోంది.

News February 11, 2026

రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి: VZM కలెక్టర్

image

రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యానమిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యాన మిషన్‌ పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది పదివేల ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా రబీలో ఇప్పటికే అదనంగా సుమారు 3,300 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగిందన్నారు.

News February 11, 2026

ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం: వనపర్తి ఎస్పీ

image

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల సరళికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా 1,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి రక్షణతో పాటు 163 BNSS (144 సెక్షన్)ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు SP స్పష్టం చేశారు.