News October 3, 2025
MBNR: దసరా EFFECT.. మాంసం దుకాణాలు కిటకిట

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి సహా పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా దుకాణాలు బంద్ కావడంతో, ఇవాళ మాంసం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.
Similar News
News October 3, 2025
ప్రాక్టికల్స్ కోసం వెళ్లి MBBS విద్యార్థిని సూసైడ్

నెల్లూరు మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో శుక్రవారం ఉదయం MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని <<17902198>>ఆత్మహత్య <<>>చేసుకుంది. మృతురాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంత జూటూరుకు చెందిన సంజీవ రాయుడు, లక్ష్మీదేవి కుమార్తె బన్నెల గీతాంజలిగా గుర్తించారు. ఇటీవల ఊరికి వచ్చిన ఆమె.. ప్రాక్టికల్స్ ఉండటంతో నిన్న కాలేజీకి వెళ్లింది. ఇవాళ ఆత్మహత్య చేసుకుంది.
News October 3, 2025
NLG: మద్యం టెండర్‌లకు మందకొడిగా దరఖాస్తులు..!

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.
News October 3, 2025
సెంటిమెంట్ ముందు అన్నీ బలాదూరే..

దసరా పండుగంటే చిన్నా, పెద్ద తేడాలేకుండా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలంగాణలో పెద్ద పండుగైన దసరా, ఈసారి జాతిపిత గాంధీజీ జయంతి రోజు రావడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. దసరా పండుగంటే గ్రామ దేవతల గద్దెల దగ్గర జంతు బలి ఇవ్వడం కొన్ని గ్రామాల్లో ఆనవాయితీ. అక్టోబరు 2వ తేది జంతువధ నిషేధం. ఇవన్నీ కూడా దసరా నాడు పక్కన బెట్టి తమ సెంటిమెంట్‌నూ ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొనసాగించారు.