News October 8, 2025

MBNR: దసరా EFFECT.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం

image

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది డిపోలలో రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చినట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. గత నెల 20 నుండి ఈ నెల 6 వరకు 14 రోజుల్లో బస్సులను 53.07 లక్షల కిలోమీటర్లు తిప్పి.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ మేరకు కండక్టర్‌లు, డ్రైవర్లు, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ప్రత్యేక అభినందనలని ఆర్ఎం తెలిపారు. SHARE IT

Similar News

News October 8, 2025

ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

image

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.

News October 8, 2025

భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

image

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>

News October 8, 2025

నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

image

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.