News January 3, 2025
MBNR: దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధి చిలుకూరులో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం HYD వలస వచ్చి చిలుకూరులో ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గురువారం స్థానికంగా ఉండే ఓ యువకుడు చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి PSలో అప్పగించారు. కేసు నమోదైంది.
Similar News
News January 5, 2025
MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News January 5, 2025
షాద్నగర్: మద్యం అమ్మితే.. రూ.50 వేల జరిమానా
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం చించోడ్ గ్రామస్థులు శనివారం ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, మద్యం కొంటే రూ.25 వేలు, పేకాట ఆడితే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
News January 5, 2025
MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.