News October 31, 2024

MBNR: దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి.!

image

✓ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
✓ వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
✓ గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
✓ కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయండి.
✓ ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE IT..

Similar News

News October 31, 2024

MBNR: నవోదయ దరఖాస్తు మరోసారి పొడిగింపు

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను.. 9,11వ తరగతుల్లో ప్రవేశానికి నిన్నటితో గడువు ముగియగా.. మరోసారి నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించారని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు ఉండాలన్నారు.

News October 31, 2024

ధరూరు: పాఠశాలలో పాము కలకలం..

image

ధరూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పాము కలకలం రేపింది. విద్యార్ధులు పాఠశాల ఆవరణలో ఉన్న చెట్ల కింద ఆడుకునేందుకు వెళ్లిన సమయంలో పాము కనిపించడంతో పరుగులు తీశారు. ఉపాధ్యాయులు అప్రమత్తం అయి విద్యార్థులను రక్షించారు. పాము బీసీ హాస్టల్‌లో చొరబడటం చూసి పలువురు గ్రామస్థులు కర్రలతో కొట్టి చంపారు. చుట్టు పక్కల చెత్త పేరుకుపోవడంతో పాములు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు.

News October 31, 2024

MBNR: మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు రానున్నాయా?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంటుకు రెండు స్థానాల చొప్పున, మొత్తంగా మరో నాలుగు నియోజకవర్గాలు ఏర్పాడనున్నాయి. జనాభా విస్తీర్ణం ప్రకారమైతే ఆరు అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు, నిపుణులలో చర్చలు జరుగుతున్నాయి. జనాభా, జిల్లా విభజన ప్రకారం అయితే ఈ సంఖ్య 20కి పెరగవచ్చని ప్రచారం సాగుతోంది.