News June 12, 2024

MBNR: ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌కు కావలసిన సర్టిఫికెట్స్!!

image

✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో. ✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్. ✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి. )✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్. ✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో. ✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి. ✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ ‌కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది. SHARE IT..

Similar News

News February 11, 2026

MBNR:మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

image

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

News February 10, 2026

MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. SAVE IT

image

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ థావుర్యనాయక్ తెలిపారు. డ్యూటీ చార్ట్ వేసి ఫోన్ నంబర్‌లను పోలింగ్ సెంటర్ల వద్ద అతికించామని, అంతరాయం ఏర్పడితే..
✒AE టౌన్-1: 87124 72160
✒AE టౌన్-2: 87124 72161
✒AE టౌన్-3: 87124 72162
✒ADE టౌన్: 87124 72156లకు ఫోన్ చేయాలన్నారు.

News February 10, 2026

MBNR: హీటర్ షాక్ కొట్టి యువకుడి మృతి

image

మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు జామ్ రవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. రవి జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో స్నానం చేయడానికి హీటర్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.