News March 14, 2025

MBNR : నవవధువు సూసైడ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసులు వివరాలు.. కొందుర్గు మం. ఎన్కెపల్లికి చెందిన సుజాత(21)కు నవాబ్‌పేట మం. లింగంపల్లికి చెందిన రాములుతో గత నెల 7న పెళ్లైంది. కాగా పెళ్లికి రూ.6 లక్షలు అయ్యాయని అవి తీసుకురావాలని భర్త ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో వెంకిర్యాలలో టీస్టాల్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకొచ్చిన సుజాత బాత్‌రూమ్‌లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI బాలస్వామి తెలిపారు.

Similar News

News March 5, 2026

ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

image

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

News March 5, 2026

విశాఖ: ‘అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు’

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 2,684 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 1,584 కేంద్రాలు అద్దె భవనంలో నడుస్తున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. భవనాల నిర్మాణాలతో పాటు కేంద్రాల్లో కనీస సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే పిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు.

News March 5, 2026

నెల్లూరు: ఈ నంబర్లు మీ దగ్గర ఉన్నాయా..?

image

వేసవికాలం దృష్ట్యా ప్రజలు ఫైర్ స్టేషన్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. టోల్ ఫ్రీ నంబర్ 101, నెల్లూరు – 0861 2331051, 9963734284, కావలి – 08626 243101, 9963734286, ఆత్మకూరు – 08627 221222, 9963734394, పొదలకూరు -08621 225202, 9963734828, రాపూరు – 08621 226145, 9963735094, ఉదయగిరి- 08620 229251, 9963735314, వింజమూరు – 08629 214437, 9963735446, మర్రిపాడు- 08620 228800, 9963744817.