News March 27, 2025

MBNR: నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ 6,9 తరగతుల ప్రవేశం కోసం జనవరి 18న పరీక్ష నిర్వహించారు. బుధవారం పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని ప్రిన్సిపల్ భాస్కర్ తెలిపారు. 6వ తరగతిలో 75 మంది విద్యార్థులు, 9వ తరగతిలో 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల సమాచారం వ్యక్తిగతంగా సేకరిస్తామన్నారు.

Similar News

News September 17, 2025

హెడ్ కానిస్టేబుల్‌పై దాడి.. బాలుడికి జైలు శిక్ష

image

గణేశ్ నిమజ్జన కార్యక్రమాల్లో ఆదోని మండలం పెసలబండకు చెందిన తెలుగు సురేశ్ (16) హెడ్ కానిస్టేబుల్ షేక్ సాబ్‌పై కర్రతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై DSP హేమలత దర్యాప్తు చేసి కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. సురేశ్‌ను పత్తికొండ కోర్టులో హాజరుపరచామని, రిమాండ్ విధించడంతో జిల్లా సబ్ జైలుకు తరలించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 17, 2025

ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

News September 17, 2025

రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

image

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT