News December 9, 2025
MBNR: ‘నవోదయ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెంలోని జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష (డిసెంబర్ 13)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు సూచించారు. బిజినేపల్లిలో సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. 29 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
Similar News
News December 22, 2025
లేటెస్ట్ అప్డేట్స్ @9AM

* నేడు ఢిల్లీ హైకోర్టులో పవన్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ.. అనుమతి లేకుండా తమ పేర్లు, ఫొటోలు వాడొద్దని పిటిషన్లు
* ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి ట్రైనింగ్..
* పోలవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ నేడు మన్యం బంద్
* AP: పల్నాడు జిల్లాలో టీడీపీ సానుభూతిపరులైన అన్నాదమ్ముల దారుణ హత్య. నిందితులను పట్టుకోవాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్‌ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
News December 22, 2025
996 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 996 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


