News December 9, 2025
MBNR: ‘నవోదయ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెంలోని జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష (డిసెంబర్ 13)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు సూచించారు. బిజినేపల్లిలో సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. 29 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
Similar News
News December 18, 2025
పుష్కర ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలి: మంచిర్యాల కలెక్టర్

2027లో గోదావరి, 2028లో కృష్ణ పురస్కారాలను పురస్కరించుకొని నదీ తీర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కుమారు దీపక్ సూచించారు. జిల్లా కార్యాలయంలో పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర దేవాదాయ శాఖ, ఎర్నెస్ట్ & యంగ్ సంస్థ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. పుష్కరాలు సురక్షితంగా నిర్వహించాలనే లక్ష్యంతో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.
News December 18, 2025
MNCL: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: సీపీ

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయన్నారు. జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశం ద్వారా ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.
News December 18, 2025
తాడిచర్ల సర్పంచ్‌కు భారీ మెజార్టీ

జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో తాడిచర్ల సర్పంచిగా బండి స్వామి విజయం సాధించి రికార్డు సృష్టించారు. గ్రామంలో 5,157 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ బలపరిచిన బండి స్వామికి 3,394 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి రావుల కల్పనకు కేవలం 831 ఓట్లు వచ్చాయి. దీంతో స్వామి 2,563 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థాయిలో మెజారిటీ రావడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.


