News February 16, 2025

MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

image

నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో శనివారం జరిగింది. స్థానికుల ప్రకారం.. ఓ కాలనీకి చెందిన ఖాజా(50) చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి పక్కింట్లో ఉంటే బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇదిగమనించిన చిన్నారి తల్లి అరవడంతో స్థానికులు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడు పారిపోయాడు. పోక్సో కేసు నమోదైంది.

Similar News

News March 14, 2025

నిర్మల్: హంటర్‌కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

image

జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన హంటర్ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పలు హత్యలు దొంగతనాల కేసులను ఛేధించడంలో హంటర్ విశేష ప్రతిభను అందించిందని, పోలీసు శాఖకు అందించిన సేవలు వెలకట్టలేవని తెలిపారు.

News March 14, 2025

మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (2/2)

image

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట పేర్లతో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో.. శ్రీరంగవరం, బండమాధరం, నూతనకల్, మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి, సోమారం, రావల్‌కోల్, కండ్లకోయ, రాజ్‌బొల్లారం, ఘన్పూర్, గోసాయిగూడ గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ నెల 17న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

News March 14, 2025

మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

image

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్‌గడిమలక్‌పేట, మజీద్‌పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.

error: Content is protected !!