News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News October 22, 2025
విశాఖ రైతు బజార్లలో డ్రా ద్వారా 129 మందికి స్టాల్స్ మంజూరు

విశాఖలోని రైతు బజార్లలో స్టాల్స్ కేటాయింపుల కోసం డ్రా నిర్వహించారు. దరఖాస్తు చేసిన వారిలో 129 మంది రైతులకు రైతు కార్డులు మంజూరు చేసినట్లు జేసీ మయూర్ అశోక్ తెలిపారు. డ్రా ప్రక్రియను కలెక్టరేట్‌లో అధికారులు, రైతుల సమక్షంలో నిర్వహించారు. ఎంపికైన వారికి త్వరలో రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించనున్నారు.
News October 22, 2025
గోదావరిఖని వన్‌టౌన్‌లో మెగా రక్తదాన శిబిరం

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ అంబర్ కిషోర్ హాజరై డీసీపీ పీ.కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌తో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు, యువత రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని తల సేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నట్లు తెలిపారు.
News October 22, 2025
ఇరాక్‌లో గుండె పోటుతో పెగడపల్లి వాసి మృతి

పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) ఇరాక్‌లో గుండె పోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వెళ్లిన రమేశ్, బుధవారం ఇంటికి వచ్చేందుకు గాను మంగళవారమే విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం రమేశ్ గుండె పోటుకు గురయ్యాడు. స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా మృతి చెందాడు.