News April 10, 2025
MBNR: నేటి నుంచి ధర్మాపూర్ శ్రీ పాండురంగస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మన్యంకొండ ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం 200 ఏళ్ల చరిత్ర కలిగినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈరోజు రాత్రికి వంశపారంపర్య ధర్మకర్త నరసింహయ్య ఇంటి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పల్లకీలో గుట్ట పైకి చేరుస్తారు. రేపు ప్రభోత్సవం జరగనుంది.
Similar News
News November 10, 2025
MBNR: నీటి వనరుల గణనపై జిల్లా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు, 7వ చిన్న నీటి పారుదల గణన, రెండో నీటి వనరుల గణన 2023-24 కోసం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
News November 10, 2025
MBNR: ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి స్వయంగా ప్రజల నుంచి 12 ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పర్యవేక్షిస్తామని ఎస్పీ తెలిపారు.
News November 10, 2025
బాదేపల్లి మార్కెట్‌లో ధరల వివరాలు

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం మొక్కజొన్న 6,683 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,977 ధర లభించింది. వడ్లు (ఆర్‌ఎన్‌ఆర్) 1,307 క్వింటాళ్లు రాగా, గరిష్ఠంగా రూ.2,419 పలికింది. హంస రకం వడ్లకు గరిష్ఠ ధర రూ.1,858 లభించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు.


