News February 21, 2025
MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Similar News
News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతం: వీర బుచ్చయ్య

PDPL జిల్లాలో గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు మూడు దశలో ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని అదనపు జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ, రెవెన్యూ, జడ్పీ, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, మీడియా కీలక పాత్ర పోషించాయన్నారు. అందరి సమన్వయం, అంకితభావమే ప్రక్రియ విజయానికి కారణమని అన్నారు.
News December 18, 2025
పెంచికల్‌పేట్ శివారులో పులి సంచారం..!

కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్- బుర్రకాయలపల్లి మధ్య పొలం మార్గంలో పులి సంచారం జరిగిందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ కొమురయ్య యాపల వాగు సమీపంలో పులి ఆనవాళ్ల కోసం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పరిశీలనలో స్థానిక నాయకుడు పల్లె నారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
News December 18, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో పెరిగిన చలి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ..!

నాగర్ కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 10.7°C అమ్రాబాద్ 10.8°C, తాడూర్ యంగంపల్లి లో 11.1°C, వెల్దండ 11.5°C, పదర మండల కేంద్రంలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కల్వకుర్తి మండలం తోటపల్లి లో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.


