News December 21, 2025

MBNR: నేడు.. SGF U-19 కరాటే ఎంపికలు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్‌లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT

Similar News

News December 26, 2025

NRPT: న్యూయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

నూతన సంవత్సర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వినీత్ తెలిపారు.
✓అనుమతి లేని పార్టీల నిర్వహణ నిషేధం.
✓ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి తప్పనిసరి.
✓కేక్ కట్టింగ్ కార్యక్రమాలపై కూడా పరిమితులు ఉంటాయని చెప్పారు.
✓డీజేలు, భారీ సౌండ్ బాక్సులతో శబ్ద కాలుష్యం సృష్టించడం నిషేధమన్నారు.
✓నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు.
✓యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి.

News December 26, 2025

తెలకపల్లి కస్తూర్బా విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన కలెక్టర్

image

రాకొండ కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై కలెక్టర్ బడావత్ సంతోష్ స్పందించారు. విద్యార్థినులు బోండాలు తిని అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం గ్యాస్ట్రిక్ సమస్య వల్లే ముగ్గురు విద్యార్థినులు ఇబ్బంది పడ్డారని, అది ఫుడ్ పాయిజన్ కాదని వివరించారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

News December 26, 2025

WNP: రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా

image

జర్నలిస్టుల అక్రిడిటేషన్ల నూతన విధానానికి వ్యతిరేకంగా ఈనెల 27న జిల్లా WNP కలెక్టరేట్‌ ఎదుట నిరసన ధర్నా చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం 11 గ. నిర్వహించే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.