News October 18, 2025

MBNR: న్యాయ కళాశాల.. 23లోగా రిపోర్ట్ చేయండి

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మాలావి Way2Newsతో తెలిపారు. ఎల్ఎల్ఎం కోర్సులో మొత్తం 20 సీట్లు అందుబాటులో ఉన్నాయని, శుక్రవారం 6 మంది విద్యార్థులు కళాశాలలో రిపోర్ట్ చేశారన్నారు. మిగతావారు ఈ నెల 23లోపు సంబంధిత పత్రాలతో రిపోర్ట్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే న్యాయ కళాశాల మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News October 18, 2025

జూరాల ప్రాజెక్టుకు 32,200 క్యూసెక్కుల వరద

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 32,200 క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి 19,561, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎడమ కాలువకు 1,030 , కుడి కాలువకు 680, ప్యార్లాల్ కెనాల్‌కు 200, భీమా లిఫ్ట్ -2కు 750 మొత్తం 22,258 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

News October 18, 2025

ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో 10,650 ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయని, 1,695 ఇళ్లు వివిధ నిర్మాణాల దశలో ఉన్నాయని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. శనివారం పెదవేగి మండలం నడిపల్లి గ్రామ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గ్రామానికి 169 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వాటిలో 79 ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 90 ఇంటి నిర్మాణాలు ఈనెల చివరికి పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News October 18, 2025

తిరుపతి: దొంగలు అరెస్ట్.. రూ.25 లక్షల సొత్తు స్వాధీనం

image

తిరుపతి జిల్లాలో ప్రయాణికుల బ్యాగుల్లో బంగారు నగలు దొంగిలించే ముగ్గురు మహిళా దొంగలను, ఇద్దరు మోటార్ సైకిల్ దొంగలను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 230 గ్రాముల బంగారు నగలు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీలు నాగభూషణరావు, రవి మనోహర్ ఆచారి వివరాలను మీడియాకు వెల్లడించారు.