News December 19, 2025
MBNR: పంచాయతీ సెక్రటరీకి గ్రూప్- 3 ఉద్యోగం

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన పాశం రాఘవేంద్రకు 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హన్వాడ మండలం రామునాయక్ తాండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిన్న వెలువడిన గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికయ్యారు. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు సంతోషం వ్యక్త చేశారు.
Similar News
News December 20, 2025
నేలలో అతి తేమతో పంటకు ప్రమాదం

పంట ఎదుగుదలకు నేలలో తగినంత తేమ అవసరం. అయితే పరిమితికి మించి తేమ, నీరు నిల్వ ఉంటే మాత్రం నేలలో గాలి ప్రసరణ తగ్గి, వేర్లకు ఆక్సిజన్ అందక శ్వాసప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల వేర్లు కుళ్లి, తెగుళ్లు ఆశించి మొక్క ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడి తగ్గుతుంది. తేమ మరీ ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. టమాటా, మిర్చి, వంకాయ, కీరదోస, బత్తాయి, ద్రాక్షల్లో అధిక తేమతో వేరుకుళ్లు సహా ఇతర సమస్యల ముప్పు పెరుగుతుంది.
News December 20, 2025
గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 20, 2025
పాటియాలా లోకోమోటివ్ వర్క్స్‌లో 225 పోస్టులు

<


