News March 31, 2025
MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..!

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు.
Similar News
News April 2, 2025
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అక్రమార్కుడు: ఎమ్మెల్యే

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అభివృద్ధిని విస్మరించి అక్రమంగా రూ.కోట్లు ఆర్జించాడని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఒక్క రేషన్ కార్డు కానీ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ మాజీ ఎమ్మెల్యే ఇవ్వలేదన్నారు.గత ప్రభుత్వ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిప్ప చేతికిచ్చారన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం హామీలను అమలు చేస్తున్నారన్నారు.
News April 2, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు జర జాగ్రత్త: ఎస్పీ

బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌కు దూరంగా ఉండాలని, అవి ప్రాణాలతో చెలగాటమాడుతాయని మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి ఓ ప్రకటనలో హెచ్చరించారు. విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో IPL బెట్టింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
News April 2, 2025
FREE బస్సు.. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో ఇదీ పరిస్థితి..!

ఫ్రీ బస్సు కారణంగా తాము బస్సు ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని పలువురు పురుషులు మంగళవారం వాపోయారు. మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వచ్చిన బస్సులన్నింటిలో మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతుండడంతో తమ పరిస్థితి ఏంటని పురుషులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్, మంగళవారం సెలవు, బుధవారం వర్కింగ్ డే కావడంతో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.