News October 27, 2025
MBNR: పటేల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తాం: డీకే అరుణ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. మహబూబ్‌నగర్ క్యాంపు ఆఫీస్‌లో ‘యూనిటీ మార్చ్’ పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఏక్ భారత్-ఆత్మనిర్బర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దేశ సమైక్యత కోసం పోరాడిన పటేల్ ఆశయ సాధనే అందరి లక్ష్యమని అరుణ అన్నారు.
Similar News
News October 27, 2025
$1B కాంట్రాక్ట్ రద్దు.. సైబర్ దాడుల వల్ల కాదు: TCS

Marks & Spencer కంపెనీ తమతో 1B డాలర్ల హెల్ప్‌డెస్క్ కాంట్రాక్టును ముగించడంపై TCS స్పందించింది. సైబర్ దాడులకు, కాంట్రాక్ట్ ముగించడానికి సంబంధం లేదని చెప్పింది. సైబర్ దాడి వైఫల్యాల వల్లే M&S కంపెనీ కాంట్రాక్టును పునరుద్ధరించలేదన్న టెలిగ్రాఫ్ కథనాన్ని తోసిపుచ్చింది. ‘సైబర్ దాడులు ఏప్రిల్‌లో జరిగాయి. కానీ మరో కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునేందుకు జనవరిలోనే M&S టెండర్లు ప్రారంభించింది’ అని తెలిపింది.
News October 27, 2025
రాష్ డ్రైవింగ్‌పై గుంటూరు పోలీసుల ఉక్కుపాదం

రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై గుంటూరు పోలీసులు రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఉక్కుపాదం మోపారు. ప్రతి సంవత్సరం దేశంలో సుమారు 2లక్షల మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని
ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. హెల్మెట్ ధరించి, నిబంధనలు పాటించడం అందరి బాధ్యత అని చెప్పారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News October 27, 2025
విశాఖ: ‘29న టిఫన్, భోజనం ప్యాకెట్లను సిద్దం చేసుకోవాలి’

ఈనెల 28న గంటకు 150-200 KM వేగంతో తుపాను తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. తీరం దాటే ప్రభావంతో చాలా నష్టం వాటిల్ల వచ్చని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అల్పాహారం, భోజనం ప్యాకెట్లను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


