News June 8, 2024

MBNR: పల్లెల్లో ‘కాంగ్రెస్’.. పట్టణాల్లో BJPకి జై !

image

సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని పట్టణవాసులు కమలం పార్టీకే జైకొడితే.. పల్లెల్లో మాత్రం కాంగ్రెస్ ది పైచేయి అయింది. పూర్వ మహబూబ్‌నగర్‌లో పురపాలికలు మొత్తం 23 ఉన్నాయి. వీటి పరిధిలో BJPకి 2,07,202 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,92,620, BRSకు 48,617 ఓట్లు వచ్చాయి. పట్టణాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకి 14,582 ఓట్లు అత్యధికంగా వచ్చాయి. NGKL లోక్ సభ స్థానం పరిధి గ్రామాల్లో BRS, BJPకి పోటాపోటీగా ఓట్లు పడ్డాయి.

Similar News

News October 3, 2024

జూరాల గేట్లు మూసివేత

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 41,039 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీ ప్రస్తుతం ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

☞ఉపాధిపై యువత పోరాడాలి:సీఐటీయూ
☞Way2Newsతో డప్పు కళాకారులు
☞రేపు వర్షాలు:వాతావరణ శాఖ
☞ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
☞SGT అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
☞కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
☞కోస్గిలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
☞DSCలో సత్తా చాటిన వారికి ఘన సన్మానం
☞దసరా సెలవులకు ఊరెళ్తూన్నారా.? అయితే జాగ్రత్త:SIలు
☞ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News October 2, 2024

MBNR: ‘డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి’

image

డిజిటల్ కార్డు సర్వే బృందాలు కుటుంబ వివరాలను పక్కాగా నిర్వహించాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. డిజిటల్ కార్డు సర్వే బృందాలకు కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డులలో ఈనెల 3నుంచి 7 వరకు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. సర్వే బృందాలకు MRO, MPDO, మున్సిపల్ కమిషనర్‌లు టీం లీడర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు.