News October 4, 2025
MBNR: పల్లె పోరు.. ఓటర్ లిస్ట్ UPDATE..!

మహబూబ్ నగర్ జిల్లాలో ZPTC,MPTC ఎన్నికలకు ఓటర్ లిస్ట్ తుది జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,99,852 మంది ఓటర్లు ఉండగా..పురుషులు 2,48,222 మంది, మహిళలు 2,51,349 మంది ఇతరులు 11 మంది ఉన్నట్లు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్ల కంటే 3,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
Similar News
News October 3, 2025
MBNR: ఖర్చులకు డబ్బు ఇవ్వలేదని యువకుడి మృతి

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మహమ్మదాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. SI శేఖర్ రెడ్డి వివరాలు.. జానంపల్లికి చెందిన కొమ్ము అమరేందర్(23) తన ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడగగా లేవు తర్వాత ఇస్తామని చెప్పగా.. మనస్తాపానికి గురై ఇంట్లో గడ్డి మందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. తల్లి కొమ్ము రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదయినట్లు SI తెలిపారు.
News October 3, 2025
MBNR: స్నాతకోత్సవం.. PU దేశంలోనే గిన్నిస్ రికార్డు

పాలమూరు విశ్వవిద్యాలయం (PU) MBNRలో 2008లో ఏర్పాటు చేశారు. 2010 నవంబరు 12న NSS(జాతీయ సేవా పథకం) విభాగం ఆధ్వర్యంలో 2,500 మందితో ‘లార్జెస్ట్ బేర్పుట్ వాక్’ అనే కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయంగా పాలమూరు యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.
News October 2, 2025
మహబూబ్‌నగర్: ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేశారని ఆమె కొనియాడారు. ఆయన బోధనలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.