News July 6, 2024

MBNR: పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి

image

బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ వ్యక్తిత్వాలను చంపేసుకుని కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన మండిపడ్డారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 6, 2026

పాలమూరు జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

image

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

News February 6, 2026

MBNR: రైతులు ALERT..యూరియా ఉంది!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63,430 మంది రైతులు 25,675 యూరియా బస్తాలను బుక్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ వెల్లడించారు. 11,892 యూరియా బస్తాలు ఇంకను రైతులకు బుక్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయని, రైతు తనకు అందుబాటులో ఉన్న మండలం, డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ చేసుకోవాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు.

News February 6, 2026

MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

image

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.