News March 22, 2025

MBNR: పాలమూరులో ఇక క్రికెట్ పండుగ

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిసారిగా SGF ఆధ్వర్యంలో “జాతీయ స్థాయి బాలుర అండర్-19 క్రికెట్ టోర్నీ” ఏప్రిల్ 26 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోర్నీలో ఒక్కో రాష్ట్రం నుంచి 16 మంది క్రీడాకారులు, ఒక కోచ్‌, ఒక మేనేజర్ పాల్గొననున్నారు. దీంతో పాలమూరులో నూతన ఉత్సాహం నెలకొననుంది.

Similar News

News March 24, 2025

HYD: రూ.5లక్షలు కాజేసిన సుడో పోలీసులు

image

HYD: బోయినపల్లిలో సుడో పోలీసు డబ్బులు కాజేశాడు. రాత్రి సమయంలో వాహనం తనిఖీ చేయలంటూ ద్విచక్ర వాహనదారుడిని సూడో పోలీసులు ఆపారు. పోలీస్ డ్రెస్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు. వాహణదారుడి దగ్గర రూ. 5లక్షల బ్యాగు ఉండటం చూసి వివరాలు అడిగారు. పోలీస్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి డబ్బులు తీసుకవెళ్లలంటూ బ్యాగుతో పరారీ అయ్యారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

News March 24, 2025

నగరంలో విద్యుత్ స్తంభాల లెక్క ఇక పక్కా

image

మహానగరంలో విద్యుత్ స్తంభాలు అసలు ఎన్ని ఉన్నాయో మనకే కాదు విద్యుత్ అధికారులకు కూడా అంతుపట్టదు. ఇక కరెంటు సమస్యలు వచ్చినప్పుడు ఏ పోల్‌లో సమస్య వచ్చిందో కనుగొనడం కష్టమవుతోంది. దీంతో స్తంభాల వివరాలను పక్కాగా లెక్కించనున్నారు. ప్రతి పోల్‌కు ఒక ఐడీ, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ఆ స్తంభం చరిత్ర మొత్తం తెలిసేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు.

News March 24, 2025

వనపర్తి జిల్లాకు YELLOW ALERT..⚠️

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

error: Content is protected !!