News September 6, 2025

MBNR: పాలమూరు వర్శిటీ..UPDATE!!

image

✒40,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు పట్టభద్రులు
✒గ్రీన్ ఛాంపియన్ అవార్డు
✒ఇంజనీరింగ్ కళాశాలలో 100% అడ్మిషన్లు
✒జి.మహేశ్వరి అఖిల భారత ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్ లో విజేత
✒రక్తదానం, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ, 2500 మందికి పైగా లబ్ధిదారులకు మేలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYDలో ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి..CM,ఎంపీలు, ప్రొఫెసర్లు, ఇతర అతిథులకు పాలమూరు విశ్వవిద్యాలయం విజయాలను పరిచయం చేశారు.

Similar News

News September 6, 2025

గణేశ్ నిమజ్జన బందోబస్తుపై పోలీసులకు సూచనలు

image

HYDలో గణేవ్ నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా గోషామహల్ ఏసీపీ సుధర్షన్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రోల్‌కాల్ నిర్వహించారు. నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొననున్న పోలీసు సిబ్బందికి అధికారులు స్పష్టమైన సూచనలు అందజేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, శాంతి భద్రతల మధ్య నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 6, 2025

కడప జిల్లా వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిదిలోని బాగాదుపల్లె వినాయక చవితి ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. గత శుక్రవారం వినాయక చవితి సందర్భంగా ఊరేగింపు సమయంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి కుమ్మితి పాలకొండయ్య (35)కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

News September 6, 2025

తిరుమల: దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.