News January 30, 2025

MBNR: పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ(పీయూ) డిగ్రీ- I, III & V ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.ఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.palamuruuniversity.com వెబ్ సైట్‌లో పొందుపరచామన్నారు. సెమిస్టర్-Iలో 32.61%, సెమిస్టర్-IIIలో 37.75%, సెమిస్టర్-Vలో 48.81% మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప, పరీక్షల నియంత్రణ అధికారి డా.రాజ్ కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

image

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News February 21, 2026

చదివేది సింగరాయకొండ.. హాజరు కనిగిరి

image

సింగరాయకొండ చైతన్య పాఠశాలలో అనుమానస్పదంగా మృతి చెందిన తౌషిక్ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తౌషిక్ మరణించిన తర్వాత శుక్రవారం రోజు కూడా కనిగిరిలో ప్రగతి విద్యా నిలయంలో పాఠశాలకు వచ్చినట్లు హాజర వేశారు. త్రిసభ్య కమిటీలో ఉన్న డీఈవో రేణుక ఇది గమనించి అవాక్కయ్యారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కౌశిక్ తల్లిదండ్రులు అంటున్నారు.

News February 21, 2026

ఉగ్రదాడికి ప్లాన్.. ఢిల్లీలో హైఅలర్ట్

image

దేశ రాజధాని ఢిల్లీలో పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఎర్రకోట సమీపంలోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడొచ్చని ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో రెడ్ ఫోర్ట్ సహా నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టారు. గతేడాది ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.